ఆపద సమయంలో 108 సిబ్బంది సేవలు అభినందనీయం
MNCL: ఆపద సమయంలో 108 సిబ్బంది సేవలు అభినందనీయమని DMHO అనిత ప్రశంసించారు. ఉత్తమ సేవలు అందించినందుకు లక్షేటిపేట 108 వాహనానికి చెందిన పైలట్లు కమటం గంగన్న, మామిడి సత్యం, శంకర్లకు ఆమె ప్రశంసా పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో 108 జిల్లా ఇన్‌చార్జ్ ప్రాజెక్టు మేనేజర్ సామ్రాట్, EME సంపత్, అధికారులు పాల్గొన్నారు.