నేడు మావోయిస్టుల బంద్.. టెన్షన్.. టెన్షన్

MLG: నేడు మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో జిల్లాలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏటూరునాగారం ఏజెన్సీలో పోలీసులు ఆదివాసీ గూడాలు, అడవుల్లో కుంబింగ్ ముమ్మరం చేశారు. ఎస్సై తాజుద్దీన్ ఆధ్వర్యంలో పలు లాడ్జీల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు లాడ్జీల్లో ఉన్నారా..? అని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.