ఇంటర్ ఫలితాల్లో నిర్మల్ జిల్లాలో బాలికలదే హవా
NRML: చదువుల తల్లి కొలువైన నిర్మల్ జిల్లాలో బాలికలు అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. ఫలితాల గణాంకాలను పరిశీలిస్తే బాలికలు 82.98% ఉత్తీర్ణతతో దూసుకుపోగా, బాలురు మాత్రం 61.46%తో సరిపెట్టుకున్నారు. అంటే బాలుర కంటే బాలికలు 21.5% అధికంగా ఉత్తీర్ణత సాధించడం గమనార్హం. జిల్లాలో మొత్తం 2,943 మంది బాలికలు హాజరుకాగా 2,442 మంది పాస్ అయ్యారు.