ఐకేపీ కొనుగోలు కేంద్రం ప్రారంభం
KMR: బీర్కూరు మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. క్వింటా ధాన్యానికి మద్దతు ధర రూ.2,389 కల్పిస్తున్నట్లు తెలిపి, రైతులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ శ్యామల, ఎమ్మార్వో సవాయి సింగ్, ఏపీఎం శిరీషలు పాల్గొన్నారు.