రెండు లారీల మధ్య ఇరుక్కున్న మినీ బస్సు
అన్నమయ్య జిల్లా రాజంపేటలోని గుండ్లూరు సాయిబాబా గుడి వద్ద ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగింది. కడప వైపుకు వెళ్తున్న లారీ బ్రిడ్జిపై స్లో అవడంతో మినీ బస్సు ఢీకొంది. తర్వాత వెనుక నుంచి వస్తున్న మరో లారీ బస్సును ఢీకొనడంతో ప్రమాదం తీవ్రతరమైంది. దీంతో మినీ బస్సు మధ్యలో ఇరుక్కుపోయి డ్రైవర్‌కు తీవ్ర గాయాలైనట్లు ఎస్సై మల్లిఖార్జున తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.