బాధితుడికి టీజీడబ్ల్యూడబ్ల్యూసీ ఆర్థిక సాయం
MNCL: జన్నారం మండలం రాంపూర్ గ్రామ నివాసి కరాజుల రాజేందర్ బైక్ ప్రమాదంలో గాయపడి కోమాలోకి వెళ్లారు. నిరుపేద కుటుంబానికి చెందిన రాజేందర్ చికిత్స కోసం తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి TGWWC రాంపూర్ కమిటీ ఆధ్వర్యంలో రూ. 12,000 ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు సింరికొండ వెంకటేష్, ఉపాధ్యక్షులు మురుకుంట్ల శేఖర్ పాల్గొన్నారు.