'బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండ'
KMR: కామారెడ్డి 14వ వార్డుకు చెందిన రాము కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావు ఇవాళ అండగా నిలిచారు. ఇటీవల అనారోగ్యానికి గురైన రాముకు మంజూరైన సీఎం సహాయ నిధి ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో ఆయన అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని తెలిపారు.