VIDEO: తల్లాడలో బీఆర్ఎస్ శ్రేణుల నిరసన

KMM: రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుని మూసివేసేందుకు కుట్ర చేస్తుందని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అబద్దపు ప్రచారాన్ని ఖండిస్తూ మంగళవారం తల్లాడ మండల కేంద్రంలో కార్యకర్తలతో కలిసి నిరసన చేపట్టారు. ఈ ప్రాజెక్టు తెలంగాణ ప్రజలకు అందిస్తున్న అపార ప్రయోజనాలను వివరించారు.