బస్సును ఢీకొన్న బైక్.. తీవ్ర గాయాలు

బస్సును ఢీకొన్న బైక్.. తీవ్ర గాయాలు

కృష్ణా: ముదినేపల్లి శివారు పెట్రోల్ బంక్ వద్ద ఆర్టీసీ బస్సుని బైక్ ఢీకొనడంతో ఇరువురికి తీవ్రగాయాలయ్యాయి. గురువారం మధ్యాహ్నం ముదినేపల్లి నుంచి గుడివాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సును బైకు ఢీ కొట్టింది. దీంట్లో ముదినేపల్లి ఎస్సీ కాలనీకి చెందిన సునీల్, రాజశేఖర్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని పోలీసులు 108లో గుడివాడ గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు.