జనగామ కలెక్టరేట్లో బసవేశ్వర జయంతి వేడుకలు
JN: కలెక్టరేట్లో సోమవారం వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహాత్మా శ్రీ బసవేశ్వర జయంతి వేడుకలను నిర్వహించారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కార్యక్రమానికి హాజరై అదనపు కలెక్టర్ బెన్షాలోంతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రోగ్రాం ప్రారంభించారు. ఈ సందర్బంగా బసవేశ్వరుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన ఆలోచనలు నేటి సమాజానికి ఆదర్శమన్నారు.