VIDEO: తాబేళ్ల పిల్లలను నీటిలోకి విడుదల చేసిన ఎమ్మెల్యే
పెద్దమైనవాని లంక సముద్ర తీరంలో ఆదివారం సముద్ర తాబేళ్ల పిల్లలను నీటిలోకి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో MLA బొమ్మిడి నాయకర్, TDP ఇంఛార్జ్ పొత్తూరి రామరాజు, రాష్ట్ర మత్స్యకార అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ కొల్లు పెద్దిరాజు పాల్గొని తాబేళ్లను సముద్రంలోకి విడిచిపెట్టారు. సముద్ర పర్యావరణ వ్యవస్థలో తాబేళ్లు కీలక పాత్ర పోషిస్తాయని MLA నాయకర్ పేర్కొన్నారు.