భారత్ దౌత్య ఫలితమే LPG నౌకలు: రణధీర్
కువైట్ యువరాజుతో ప్రధాని మోదీ మాట్లాడినట్లు కేంద్ర విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ వెల్లడించారు. ఆయా దేశాలు, భాగస్వామ్య పక్షాలతో దౌత్యపరంగానూ చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. ఈ చర్చల ఫలితంగానే రెండు LPG నౌకలను హర్మూజ్ జలసంధి మార్గం ద్వారా తీసుకురాగలిగినట్లు స్పష్టం చేశారు. దేశ ఇంధన అవసరాలు తీరేలా ఇతర దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.