మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
GDWL: అలంపూర్ చౌరస్తా మార్కెట్ యార్డ్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే విజయుడు ఇవాళ ప్రారంభించారు. ఆయన రైతులతో మాట్లాడి పంట నాణ్యతను పరిశీలించారు. రైతులు దళారులను నమ్మి నష్టపోవద్దని, ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు పంటను విక్రయించుకోవాలన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని అన్నారు. కొనుగోలు కేంద్రాలతో ఆర్థిక భరోసా కల్పించడం లక్ష్యమన్నారు.