గుడ్డం కోనేరుకు రూ.1.50 కోట్లు విడుదల

SS: హిందూపురంలో స్థానిక గుడ్డం రంగనాథ స్వామి దేవాలయం దగ్గర ఉన్న గుడ్డం కోనేరుకు అహుడా నుండి రూ.1.50 కోట్లు విడుదల అయినట్లు హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ రమేశ్ తెలిపారు. ఈ సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గుడ్డం కోనేరుకు గురువారం భూమి పూజ చేయనున్నారు. మున్సిపల్ ఛైర్మన్ మాట్లాడుతూ.. వినాయక చవితికి గుడ్డం కోనేరు సుందరంగా తయారవుతుందని తెలిపారు.