'పరిమితికి మించి ప్రయాణిస్తే చర్యలు తప్పవు'
KRNL: ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తే చర్యలు తప్పవని డ్రైవర్లను సీఐ యుగంధర్ హెచ్చరించారు. వెల్దుర్తి పట్టణ సమీపంలోని హనుమాన్ విగ్రహం వద్ద సిబ్బందితో కలిసి సీఐ ఇవాళ వాహనాల తనిఖీ నిర్వహించారు. అనంతరం జిల్లా నుంచి పట్టణంలోకి పరిమితికి మించి ఆటోలో ప్రయాణిస్తున్న టాటా మ్యాజిక్ వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించి, జరిమానా విధించినట్లు తెలిపారు.