గోవుల అక్రమ రవాణా.. పోలీసులు పట్టివేత

గోవుల అక్రమ రవాణా.. పోలీసులు పట్టివేత

BDK: మణుగూరు మండలం పెద్దపల్లి గ్రామం నుంచి పశువులను అక్రమంగా తరలిస్తున్నట్లు స్థానికులు పోలీసులకు సోమవారం సమాచారం అందించారు. రంగంలో దిగిన పోలీసులు వ్యాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యాన్‌లో సుమారు 50 నోరులేని జీవాలు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. అనంతరం అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.