రోడ్డు ప్రమాదంలో వృద్ధునికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో వృద్ధునికి తీవ్ర గాయాలు

VZM: గంట్యాడ మండలంలోని కొటారబిల్లి జంక్షన్ వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామానికి చెందిన కుమిలి శెట్టి కృష్ణ కోవెల వద్ద దుకాణం కట్టుకొని వెళ్తుండగా గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ మేరకు కృష్ణను 108 వాహనంలో వైద్య చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.