తుప్పు పట్టిపోయిన ప్రభుత్వ వాహనాలు
ప్రకాశం: కనిగిరిలోని జల వనరులశాఖ కార్యాలయంలో వాహనాలు పిచ్చిచెట్ల మధ్య ఏళ్లుగా పనికిరాకుండా ఉన్నాయి. వినియోగంలేకపోవడంతో వాహనాలు తుప్పుపట్టిపోయాయి. వాహనాలను వినియోగంలోకి తీసుకురావాలని, స్క్రాప్ విక్రయించాలని అధికారులు చెబుతున్నారు. చెట్లమధ్య వాహనాలు ఉండటం వల్ల విష పురుగులకు ఆవాసంగా మారాయని స్థానికులు వాపోతున్నారు.