జనావాసాలలోకి వచ్చిన భారీ కొండచిలువ
JN: పాలకుర్తి మండలం బొమ్మెర గ్రామంలోని వల్లెపు కుమారస్వామి ఇంటి ఆవరణలో శుక్రవారం ఓ భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. కుటుంబ సభ్యులు భయాందోళన గురై గ్రామస్తులకు తెలపడంతో కొండ చిలువ స్థానికులపై దాడి చేసేందుకు యత్నించడంతో తప్పనిసరి పరిస్థితిలో కొండ చిలువను కొట్టి చంపినట్లు తెలిపారు. అధికారులు కాలనీలో పేరుకు పోయిన చెట్ల పొదలను తొలగించాలని వారు కోరారు .