రోడ్లపై పేరుకపోయిన ఇసుక దిబ్బలు..!

రోడ్లపై పేరుకపోయిన ఇసుక దిబ్బలు..!

మేడ్చల్: భారీ వర్షాలు కురవడంతో బోడుప్పల్ హనుమాన్ నగర్, ఉప్పల్ కావేరి నగర్ ప్రాంతాలలో భారీ వరదలకు ఇసుక, కాంక్రీట్ ముక్కలు కాలనీలలోకి కొట్టుకొచ్చాయి. రోడ్లపై ఇసుక దిబ్బలు పేరుకుపోయాయి. దీని కారణంగా అనేక చోట్ల వరద నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ వర్షం కురిస్తే, ఇబ్బంది ఉంటుందని, చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.