VIDEO: ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడికి జైలు శిక్ష
MDK: తూప్రాన్ మండలంలో మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడికి న్యాయస్థానం కఠిన శిక్ష విధించింది. ఉపాధ్యాయుడికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.1 లక్ష జరిమానా విధించారు అని పోలీసులు వెల్లడించారు. 2023లో ఒడిశా రాష్ట్రానికి చెందిన కోకిల కోమల్ అనురూప అనలాంకర్ (28) బాలికతో అనుచితంగా ప్రవర్తించడంతో అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.