గంజాయి రవాణా కేసులో ముగ్గురికి 10 ఏళ్ల జైలు

గంజాయి రవాణా కేసులో ముగ్గురికి 10 ఏళ్ల జైలు

జనగామ జిల్లాలో గంజాయి అక్రమ రవాణా కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. 126 కిలోల గంజాయి స్వాధీనం కేసులో నిందితులు సుధాకర్, దినేష్, సురేష్‌లకు ఒక్కొక్కరికి 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. 1 లక్ష జరిమానా విధిస్తూ నేడు జిల్లా జడ్జి బీ. ప్రతిమ తీర్పు ఇచ్చారు. ఈ కేసులో 2021 జూలై 2న హైదరాబాద్ రోడ్డులో నిందితుల వద్ద నుంచి గంజాయి, కారు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.