ఇంధన పరిరక్షణ వారోత్సవాలు: APSPDCL సీఎండీ
KRNL: ఇంధన పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా ఈనెల 19, 20 తేదీల్లో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు ఆదివారం APSPDCL సీఎండీ శివశంకర్ తెలిపారు. కర్నూలుతో పాటు రాయలసీమ జిల్లాల్లోని 9 జిల్లాల ప్రభుత్వ పాఠశాలల 9, 10 తరగతి విద్యార్థులకు స్టాల్స్ ఏర్పాటు, పోటీలు ఉంటాయన్నారు. ఆసక్తిగల విద్యార్థులు ఈనెల 17వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.