నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

SKLM: సోంపేట మండలంలోని జింక భద్ర, బెంకిలి, సోంపేట పట్టణంలో ఆదివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఈ ఈ యజ్ఞేశ్వర రావు శనివారం తెలిపారు. సోంపేట సబ్ స్టేషన్‌లో విద్యుత్ నిర్వహణ పనుల్లో భాగంగా ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు చెప్పారు. ఈ విషయంపై వినియోగదారులు సహకరించాలని కోరారు.