అర్ధరాత్రి వరకు ఏసీబీ తనిఖీలు
TG: రాష్ట్ర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు జరిగాయి. అర్ధరాత్రి వరకు ఏసీబీ తనిఖీలు కొనసాగాయి. హైదరాబాద్, వరంగల్, మంచిర్యాల, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో తనిఖీలు నిర్వహించారు. పలు కీలక పత్రాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. బాధితుల వరుస ఫిర్యాదులతో ఏసీబీ మెరుపుదాడులు నిర్వహించింది.