శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం

శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం

KDP: ఒంటిమిట్ట శ్రీకోదండరామ స్వామికి శనివారం శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. గర్భాలయంలోని మూలవిరాట్‌కి పంచామృతాభిషేకాలు చేశారు. టీటీడీ అధికారులు సమర్పించిన నూతన పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. అనంతరం అర్చకులు పూజలు చేశారు. శనివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.