గంజాయి భస్మాసుర హస్తం లాంటిది: సీఐ
ASR: యువత గంజాయి, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కొయ్యూరు సీఐ బీ. శ్రీనివాసరావు సూచించారు. సోమవారం కొయ్యూరులో మాట్లాడుతూ.. కొంతమంది ప్రలోభాలకు గురై, గంజాయి రవాణా తదితర అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొని, జైలు పాలవుతూ జీవితాలు నాశనం చేసుకుంటున్నారన్నారు. గంజాయి భస్మాసుర హస్తం లాంటిదన్నారు. గంజాయితో తమ జీవితాలను తామే నాశనం చేసుకుంటున్నారని తెలిపారు.