'గ్యాస్ సరఫరాలో అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు'

'గ్యాస్ సరఫరాలో అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు'

ATP: గుంతకల్లులోని గ్యాస్ గోడౌన్‌లను శుక్రవారం పౌర సరఫరాల డిప్యూటీ ఎమ్మార్వో సుబ్బలక్ష్మి తనిఖీ చేశారు. గోడౌన్‌లో ఉన్న గ్యాస్ సిలిండర్ల స్టాకును పరిశీలించారు. కలెక్టర్ సూచన మేరకు వినియోగదారులకు గ్యాస్ సరిపడా ఉండేలా చూడాలని తెలిపారు. గ్యాస్ సిలిండర్ సరఫరాల అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.