VIDEO: వెంకటాచలం వద్ద ట్రాక్టర్ బోల్తా.. 15 మందికి గాయాలు
ప్రకాశం: దర్శి మండలం వెంకటాచలం సమీపంలో మంగళవారం పొగాకు పనులకు కూలీలతో వెళ్లున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో 15 మంది మహిళా కూలీలు ట్రాక్టర్లో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.