VIDEO: మేడారంలో ఎల్ఈడీ స్క్రీన్ కూలి భక్తునికి గాయాలు
ములుగు జిల్లా మేడారం జాతర సందర్భంగా హరిత హోటల్ వద్ద శుక్రవారం అపశృతి చోటుచేసుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్ అకస్మాత్తుగా కూలి ఓ భక్తునికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనను గమనించిన పోలీసులు వెంటనే స్పందించి గాయపడిన భక్తుడిని ఆస్పత్రికి తరలించారు. సంఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.