లాహోర్‌లోని అమెరికా కాన్సులేట్ వద్ద ఉద్రిక్తత
పాక్ లాహోర్‌లోని అమెరికా కాన్సులేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఖమేనీ మృతిని వ్యతిరేకిస్తూ దాయాది దేశంలోని ఇరాన్ మద్దతుదారులు కాన్సులేట్‌లోకి దూసుకెళ్లారు. అనంతరం అక్కడి గేట్‌కు నిరసనకారులు నిప్పు పెట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.