1200 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

VZM: గజపతినగరం ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో గల రొంపల్లి నెల్లిగుడ్డి కోటపర్తివలస తదితర ప్రాంతాల్లో బుధవారం గజపతినగరం ఎక్సైజ్ సీఐ జె.జనార్దన రావు, ఆరుకు సీఐ సంతోష్, మొబైల్ సీఐ శ్రీధర్ పర్యవేక్షణలో దాడులు నిర్వహించగా సుమారు 1200 లీటర్ల పులిసిన బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేశారు. దాడుల్లో ఎస్సైలు నరేంద్ర కుమార్, రమేష్, గంగాధర్ సిబ్బంది పాల్గొన్నారు.