సింగరేణిలో ర్యాలీ నిర్వహించిన మత్స్యకారులు

సింగరేణిలో ర్యాలీ నిర్వహించిన మత్స్యకారులు

KMM: సింగరేణి మండలంలో సింగరేణి మత్స్యశాఖ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జాతీయ మత్స్యకారుల దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ సభ్యులు, ముదిరాజ్ సంఘం సభ్యులు జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.