కలెక్టర్‌ను కలిసిన రిటైర్డ్ ఉద్యోగులు

కలెక్టర్‌ను కలిసిన రిటైర్డ్ ఉద్యోగులు

మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌ను రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు సన్మానించారు. కలెక్టర్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డును స్వీకరించిన విషయం తెలిసిందే. ఆ సంఘం నాయకులు శనివారం మంచిర్యాల కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలిసి అభినందించారు. జల సంరక్షణ, ఇంకుడు గుంతల నిర్మాణం విజయవంతంగా అమలు చేశారని కలెక్టర్ ను వారు అభినందించారు.