'మమ్మల్ని భాగస్వాములుగా గుర్తించండి'
RR: షాద్‌నగర్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా NPRD జిల్లా అధ్యక్షులు ఆశన్న గారి భుజంగారెడ్డి మాట్లాడుతూ.. దివ్యాంగులను సమాజం బాధితులుగా కాకుండా సమాన భాగస్వాములుగా గుర్తించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన పథకాలను అమలు చేయాలన్నారు.