మూడు గేదె దూడలను చంపిన పెద్దపులి
ELR: పోలవరం జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. ఈ క్రమంలో ముసినిమిల్లిలో ఇవాళ మూడు గేదె దూడలను చంపేసినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న అటవీ, పశు సంవర్ధకశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. పులి సంచరిస్తున్న నేపథ్యంలో సమీపంలోనే గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల ఉండటంతో పిల్లలు, గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.