పోషణ పక్వాడ కార్యక్రమానికి తూట్లు
అనంతపురం: పోషణ పక్వాడ కార్యక్రమానికి ICDS అధికారులు తూట్లు పొడుస్తున్నారు. ఆత్మకూరు మండలంలో 47 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా.. ఇద్దరు ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు ఉండటం గమనార్హంగా మారింది. అంగన్వాడీ కేంద్రాల్లో సమస్యలు రాజ్యమేలుతుంటే సూపర్ వైజర్‌లు అంగన్వాడీ కేంద్రాల వైపు కన్నెత్తి చూడడం లేదని అంగన్వాడీ టీచర్స్ నుంచి విరివిగా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.