గేదెల మేత విషయంలో దంపతులకు శిక్ష

గేదెల మేత విషయంలో దంపతులకు శిక్ష

ప్రకాశం: మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో గేదెల మేత విషయంలో నాతాని చిరంజీవి, ధనలక్ష్మి దంపతులు నాతాని కమలాకర్‌పై దాడి చేశారు. ఈ కేసులో నిందితుడు నాతాని చిరంజీవికి ఒంగోలు మొబైల్ న్యాయస్థానం గురువారం రెండేళ్ల జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధించింది. మరో నిందితురాలికి రూ.1000 జరిమానా విధించారు. ఈ సంఘటన 2020 అక్టోబర్ 4న జరిగింది. కాగా తాజాగా తీర్పు ఖరారైంది.