VIDEO: 'ప్రశాంత వాతావరణంలో ఎన్నికల జరిపేందుకు సహకరించాలి'
MDK: ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ ఎన్నికలు జరిపేందుకు ప్రజలు సహకరించాలని మెదక్ ఎస్పీ డివి శ్రీనివాసరావు సూచించారు. నామినేషన్ల చివరి రోజు రామాయంపేట మండల కేంద్రంలో నిర్వహిస్తున్న నామినేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. జిల్లావ్యాప్తంగా 500 మంది పోలీస్ సిబ్బందితో ఎన్నికలు జరిపేందుకు ఏర్పాటు చేశామని, ఎవరైనా గొడవలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.