HNK: పెట్రోల్ కొరత పుకార్లు.. బంకు వద్ద భారీ రద్దీ
HNK: నగరంలో పెట్రోల్ కొరతపై పుకార్లతో వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమీపంలోని భారత్ పెట్రోల్ బంకు వద్ద బుధవారం సాయంత్రం భారీగా వాహనాలు చేరాయి. అవసరం లేకపోయినా వాహనదారులు ఫుల్ ట్యాంక్ చేయించుకోవడంతో బంకుల వద్ద రద్దీ పెరిగింది. అయితే నగరంలో పెట్రోల్ కొరత లేదని అధికారులు స్పష్టం చేశారు.