పదో తరగతి పరీక్షలకు 8 మంది గైర్హాజరు
SRCL: జిల్లాలో శనివారం పదో తరగతి నాలుగవ రోజు పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని డీఈఓ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. 34 కేంద్రాలలో మొత్తం 7,317 మంది విద్యార్థులకు గాను 7,309 మంది హాజరయ్యారని, 8మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 99.89 శాతం హాజరు నమోదైందని, ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని ఆయన వెల్లడించారు.