చికెన్ పట్ల అపోహలు వద్దు: ఎమ్మెల్సీ

CTR: చికెన్ పట్ల సామాజిక మాధ్యమంలో వస్తున్న అపోహలను నమ్మొద్దని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు. కుప్పం టీడీపీ కార్యాలయ సమీపంలో ఆదివారం సాయంత్రం చికెన్ మేళా కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం ప్రారంభించారు. చికెన్, కోడిగుడ్లలో మంచి ప్రోటీన్లు ఉంటాయని, అపోహలను పక్కనపెట్టి చికెన్ తినొచ్చని అన్నారు.