కృష్ణానదిలో పడి యువకుడి మృతి
కృష్ణానదిలో పడి యువకుడు సీతారాం మృతి చెందిన ఘటన తోట్లవల్లూరులో బుధవారం చోటుచేసుకుంది. వారం కిందట ఇంటి నుంచి వెళ్లిపోయాడని తండ్రి శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. చేపల వేటకు వెళ్లిన జాలర్లు నదిలో సీతారాం మృతదేహాన్ని గుర్తించారు. కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. పోస్టుమార్టం తర్వాత శవాన్ని కుటుంబానికి అప్పగించారు.