వాటర్ ట్యాంక్ నిర్మాణానికి విరాళం..!
E.G: రాజానగరం చక్రద్వార బంధం గ్రామంలో శ్రీ భవాని సమేత చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం వద్ద వాటర్ ట్యాంక్ నిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నేత విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు హాజరయ్యారు. వాటర్ ట్యాంక్ నిర్మాణానికి తన వంతు సహాయంగా రూ. 1,00,000 చెక్కును కమిటీ సభ్యులకు ఇచ్చారు.