VIDEO: తల్లి కొడుకులపై కత్తులతో గుర్తుతెలియని వ్యక్తుల దాడి
SRCL: బోయినిపల్లి మండలం నీలోజిపల్లిలో గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. నీలోజిపల్లిలో సింగిరెడ్డి వెంకటేశ్‌పై కత్తులతో దాడి చేశారు. అడ్డువచ్చిన వెంకటేశ్ తల్లిపై కూడా కత్తులతో దాడి చేశారు. దీంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు గమనించి క్షతగాత్రులను ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.