నేడు మండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే
CTR: గుడిపాల మండలంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మంగళవారం పర్యటించనున్నారని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం తెలిపింది. రామభద్రాపురం పంచాయతీలో నిర్మించిన ఆరోగ్య ఉపకేంద్రం, గ్రామసచివాలయ భవనం, సీసీ రోడ్డును ప్రారంభించి అనంతరం గ్రామసభలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. గ్రామసభలో ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారం చూపుతారన్నారు.