మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
GDWL: అలంపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే విజయుడు, మార్కెట్ యార్డ్ ఛైర్మన్ దొడ్డప్ప ప్రారంభించారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా మద్దతు ధర పొందాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో పురపాలక ఛైర్మన్ జయరాముడు, మాజీ టెలికం కమిటీ మెంబర్ ఇస్మాయిల్, కౌన్సిలర్లు పద్మావతి, రాజ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.