జిన్నారం మండలంలో క్రమక్రమంగా తగ్గుతున్న ఉష్ణోగ్రతలు

జిన్నారం మండలంలో క్రమక్రమంగా తగ్గుతున్న ఉష్ణోగ్రతలు

SRD: పటాన్‌చెరు నియోజకవర్గంలో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా తగ్గుతున్నాయి. వాతావరణ శాఖ ఉష్ణోగ్రతల లెక్కల ప్రకారం సోమవారం ఉదయం జిన్నారం మండలంలో 12.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గాలిలో తేమ శాతం 92.9%గా ఉంది. ఉదయం వేళలో పొగ మంచుతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు. చలితో వృద్ధులు, ఆస్తమా వ్యాధిగ్రస్తులు, గర్భిణీలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు.