నీళ్ల కోసం కిలోమీటర్ల దూరం.. మదనగరువు దుస్థితి

నీళ్ల కోసం కిలోమీటర్ల దూరం.. మదనగరువు దుస్థితి

AKP: దేవరాపల్లి మండలం చింతలపూడి పంచాయతీ మదనగరువు గ్రామంలో త్రాగునీటి కోసం గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిలోమీటర్ల దూరం వెళ్లి ఊట నీరు తెచ్చుకుంటున్నామని, మమ్మల్ని మనుషులుగా గుర్తించి మంచినీటి సౌకర్యం కల్పించాలని ఆదివారం వేడుకున్నారు. అధికారులు నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, జల్ జీవన్ మిషన్ ప్రయోజనాలు తమకు అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.