తేగడలో మహా శివరాత్రి వేడుకలు
BDK: చర్ల తేగడ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో మహా శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు అర్చకులు భాను ప్రకాష్ తెలిపారు. ఈ నెల 15న తెల్లవారుజామున 4 గంటల నుంచి విశేష రుద్రాభిషేకాలు, 16న స్వామివారి కళ్యాణం అనంతరం గ్రామ వీధుల్లో ఊరేగింపు జరగనుందని తెలిపారు. ఉత్సవాలకు వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 2 లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందన్నారు.